మండపేటలో `ఎమ్మెల్ల్యే` వేగుళ్ళ జన్మదిన వేడుకలు
మండపేట (CLiC2NEWS) : మండపేట శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ల 66వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తవానికి వేగుళ్ల జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా మాదిరిగా ఎమ్మెల్యే వేగుళ్ల కుటుంబ సమేతంగా అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు. ఆయన పుట్టిన రోజు సత్యదేవుని సన్నిదానంలో జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పుట్టిన రోజునాడు కూడా సత్యనారాయణమూర్తికి సేవ చేయడానికి, వ్రతం నోచుకోవడానికి తెల్లవారు జామునే అన్నవరం తరలి వెళ్లారు. వేగుళ్ల పుట్టిన రోజున స్థానికంగా అందుబాటులో లేనప్పటికీ అభిమానులు, కార్యకర్తలు ఆయన పేరున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వుంగరాల రాంబాబు ఆధ్వర్యంలో మయూరీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నియోజక వర్గాన్ని దశదిశలా అభివృద్ధి చేసి హ్యాట్రిక్ సాధించారని అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా ఎమ్మెల్యే నియోజక వర్గానికి సేవలు అందిస్తూ ప్రజల్లో తరగని ఆదరణ పొందారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు. నియోజకవర్గానికి పూర్వ వైభవం రావాలంటే ఎమ్మెల్యే వేగుళ్ళతోనే సాధ్యం అన్నారు. ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు పరితపించే నాయకుడిగా ఖ్యాతి గడించిన ఎమ్మెల్యే ఎల్లకాలం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. తొలుత వృద్దుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి, అందరికీ స్వీట్లు పంచారు. అనంతరం వృద్దులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల గుప్తా, కేతా దుర్గా ప్రసాద్, సిద్దిరెడ్డి రామకృష్ణ, పాలచర్ల శిరీష్, కాళ్ళకూరి శ్రీనివాస్, అల్లూరి రామకృష్ణ చౌదరి, కేతా శరణ్, తదితరులు పాల్గొన్నారు.