Hyderabad: నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థి దారుణహత్య

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బాలాపుర్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎంపిఎస్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతన్న ప్రశాంత్ గురువారం హత్యకు గురయ్యాడు. మండి 37 హోటల్‌లో విద్యార్థి భోజన చేస్తుండగా .. ముగ్గురు వ్యక్తులు కత్తులతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన ప్రశాంత్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.