మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దు
మండపేట (CLiC2NEWS): విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మండపేట టౌన్ సిఐ సురేష్ సూచించారు. పట్టణంలోని శ్రీవత్స ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుర్వినియోగం అనే అంశాలపై విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. అలాగే డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. విద్య ద్వారానే సమాజంలో మనిషికి గౌరవ మర్యాదలు లభిస్తాయని, తల్లి దండ్రులు కూడా తమ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ఎన్నో కలలు కంటారని, వారి కలలు సాకారం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. వ్యాస రచన పోటీల్లో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read : ఎంబిబిఎస్ ఫ్రీ సీటు సాధించిన విద్యార్థికి అభింనందన
[…] […]
[…] Also Read: మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశ… […]