TS: ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర షురూ..

క‌రీంన‌గ‌ర్(CLiC2NEWS): మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌మ‌లాపూర్ మండ‌లం బ‌త్తిన‌వారి ప‌ల్లె నుండి పాద‌యాత్ర ప్రారంభించారు. ఆయ‌న మెద‌టిరోజు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో `ప్ర‌జాదీవెన పాద‌యాత్ర` మొద‌లుపెట్టి, మాద‌న్న‌పేట‌, గునిప‌ర్తి, శ్రీ‌రాముల పేట‌, అంబ‌ల గ్రామాల మీదుగా పాద‌యాత్ర చేస్తారు. ఈ పాదయాత్ర 25-26 రోజుల పాటు ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను కలిసేలా సాగుతుందని వివరించారు. ప్రజలందరూ తనను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న స‌తీమ‌ణి జ‌మున‌, మాజీ జ‌డ్పీ ఛైర్మ‌న్ తుల ఉమ వీర‌తిల‌కం దిద్ది మంగ‌ళ‌హార‌తులిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.