గాంధీ హాస్పిటల్‌లో ఈవినింగ్ ఒపి సేవలు ప్రారంభం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఈవినంగ్ ఒపి సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హారీశ్‌రావు ఆదేశాల మేరకు గాంధీ హాస్పిటల్‌లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఒపి సేవలు ప్రారంభించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజి, పిడియాట్రిక్, ఆర్థోపెడిక్స్‌కు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉండనున్నారు.