శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలి: పెద్ద‌ప‌ల్లి డిసిపి

రామగుండము పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): రామ‌గుండం పోలీస్ స్టేష‌న్‌ను డిసిపి వైభ‌వ్ గైక్వాడ్ గుర‌వారం త‌నిఖీ చేసి.. సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలన్నారు. పోలీసులంటే ప్రజల రక్షకులు అనే విధంగా వ్యవహరించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా లోతుగా విచారణ జరిపి చర్యలు తీ సుకోవాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందనే విష యాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచరాదని సూచించారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి.. సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెరిగేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాల‌న్నారు.

అనంత‌రం స్టేషన్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ శరణ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.