బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
రామగుండం పోలీస్ కమిషనరేట్(CLiC2NEWS): రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలు ప్రకారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ ముస్కాన్-IX సంబందించిన కో -ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. అయినవారికి దూరమై క్షణం ఒక యుగంగా బతుకుతున్న చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా తెలంగాణ పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్-IX’ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్-IX.. 31 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 01 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంద ని డిసిపి తెలిపారు . 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన, వదిలివేయబడిన, కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి, రక్షించి వారి తల్లి దండ్రులకు అప్పగించాలన్నారు. బలవంతంగా బిక్షాటన, వెట్టి చాకిరి చేయించే వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా.. ప్రత్యేకంగా మంచిర్యాల పెద్దపల్లి జోన్ లోని ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్.ఐ మరియు నలుగురు సిబ్బందిని నియమించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ లు అశోక్, కృష్ణ రెడ్డి, MD వహిద్ CWC చైర్మన్ మంచిర్యాల, బి. వెంకటేష్ DMHO, టి. విజయ్ కుమార్, DEO, మంచిర్యాల, వి. సుమలత, బి. శ్యామసుందర్ CWC మెంబెర్స్ ,KVS రాజలింగు లేబర్ ఆఫీసర్ , అయిలయ్యCWC, సామ్య,ACDPO/BRDC పెద్దపల్లి , పద్మజా DEO మంచిర్యాల ,కృప బాయి DM & HO పెద్దపల్లి , మంచిర్యాల మరియు పెద్దపల్లి పోలీస్ అధికారులు పాల్గొన్నారు .