ఈవిఎం గోదాము భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

జనగామ (CLiC2NEWS): జనగామ జిల్లాలో మంగళవారం మాసవారి తనిఖీల్లో భాగంగా ఈవిఎం గోదామును జిల్లా కలెక్టర్ శివలింగయ్య తనిఖీ చేశారు. ఈవిఎం గోదాము భద్రతలో అప్రమత్తంగా ఉండాల‌ని అధికారులను ఆదేశించారు.

ముందుగా కలెక్టర్ తాళం వేసి ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన ఆయ‌న‌ కెమెరాల‌ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ తోపాటు ఆర్డిఒ మధు మోహన్, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.