హైదరాబాద్లో నకిలీ మైసూర్ శాండిల్ సబ్బుల తయారీ..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో నకిలీ మైసూర్ శాండిల్ సబ్బుల తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సమగ్రమైన సమాచారంతో మలక్పేట పోలీసులు నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్న వారిని అరెస్టు చేసి.. దాదాపు 2 కోట్ల విలువగల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కెఎస్డిఎల్ సంస్థకు మైసూర్ శాండిల్ సబ్బులు తయారు చేయడానికి పేటెంట్ హక్కులు ఉన్నాయి. అయితే హైదరాబాద్లో నకిలీ సబ్బులు తయారు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కెఎస్డిఎల్ ఛైర్మన్ ఎం.బి పాటిల్ సమాచారం అందింది. దీంతో తెలంగాణ అధికారులకు సమాచారం ఇచ్చారు. నగరంలోని రాకేశ్జైన్, మహావీర్ జైన్లను నిందితులుగా గుర్తించారు.