సమాచారం అంతా గోప్యంగా ఉంటుంది.. ఆందోళ‌న చెందొద్దు: మంత్రి పొన్నం

హుస్నాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న స‌ర్వే ప్రారంభ‌మ‌యిన విష‌యం తెలిసిందే. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో సిద్దిపేట‌లోని హుస్నాబాద్‌లో స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప‌రిశీలించారు. 87 వేల మంది ఎన్యుమ‌రేట‌ర్ల‌తో ఈ కార్య‌క్ర‌మం సాగుతుంద‌ని, ఇది చారిత్ర‌క ఘ‌ట్ట‌మ‌న్నారు. స‌మాచారం అంతా గోప్యంగా ఉంటుందని, దీనివ‌ల్ల సంక్షేమ ప‌థ‌కాల్లో కోత ఉండ‌ద‌ని, ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌న్నారు. హైద‌రాబాద్‌లో కొన్ని చోట్ల స‌ర్వేకు ఇబ్బందులు క‌లిగిస్తున్నార‌ని.. ఇది స‌రికాద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు భాగ‌స్వాములు కావా ని ల‌ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.