ఢిల్లీ స‌రిహ‌ద్దుల‌ను ఖాళీ చేస్తున్న రైతులు

న్యూడిల్లీ(CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో దాదాద‌పు 15 నెల‌లుగా అలుపెరుగ‌క ఆందోళ‌న చేసున్న రైతన్న‌లు ఎట్ట‌కేల‌కు నిష్ర్క‌మిస్తున్నారు గ‌జిపూర్‌, సింఘా, టిక్రి బోర్డ‌ర్ల‌ను విడిచి రైతులు వెళ్లున్నారు. కొత్త సాగుచ‌ట్టాల‌ను కేంద్రంలోని మోడీ స‌ర్కార్ ర‌ద్దు చేయ‌డంతో రైత‌న్న‌లు విజ‌యోత్సాహంతో తిరిగి స్వ‌స్థ‌లాల‌కు ప‌యనం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు టిక్రి వ‌ద్ద సంబరాల‌ను జ‌రుపుకున్నారు. చిందులు వేస్తే ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఆందోళ‌న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన టెంట్ల‌ను తొల‌గిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.