ఢిల్లీ చలో.. కనీస మద్ధతు ధరపై రైతుల ఆందోళన..

ఢిల్లీ (CLiC2NEWS): పంజాబ్, హరియాణా నుండి వేలాది మంది రైతన్నలు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. తమ డిమాండ్ల ( పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 అందోళనల్లో పెట్టిన కేసులు ఎత్తివేత )ను నెరవేర్చుకునేందుకు అన్నదాతలు ఢిల్లీకి వెళ్లారు. ఆరు నెలలకు సరిపడా రేషన్, డీజిల్, సుత్తి, రాళ్లను పగల కొట్టే పరికరాలతో సహా కావాల్సినవన్నీ తీసుకుని వందల సంఖ్యలో ట్రాక్టర్లు, వాహనాలు బయల్దేరతాయని రైతన్నలు మీడియాకు తెలిపనట్లు సమాచారం.
రైతులు చేపడుతున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీనిపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్‌పిపై తక్షణమే చట్టం తీసుకురావడం కష్టమని, దీనిపై రైతు సంఘాలతో చర్చించాల్సి ఉంటుందన్నారు. కొన్ని రాజకీయ శక్తులు తమ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను వాడుకుంటున్నాయన్నారు. దీని పట్లు అప్రమత్తంగా ఉండాలిన, కనీస మద్దతు ధర పై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేమన్నారు. రైతు సంఘాలు ఆందోలన విరమిఆంచి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చల కోసం రావాలని మంత్రి కోరారు.