పండుగ స్పెషల్: సికింద్రాబాద్ – రంగనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/TRAIN-PASSENGERS.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులను ఇబ్బంది కలుగకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీనిలో భాగంగా సికింద్రాబాద్ నుండి రంగనాథపురంకు జనవరి 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, ఎగ్మూర్, చెంగల్‌పట్టు, విల్లుపురం, తిరుప్పదిరిపులియూర్, చిదంబరం, శీర్గాళి, మైలాడుదురై, తిరువారూర్, తిరుత్తురైపూండి, అదిరాంపట్టినం, పట్టుకొట్టయి, ఆరంతాంగి, కారైక్కుడి, శివగంగ, మానామధురై స్టేషన్‌లలో అగుతాయి.
సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు ఆయా తేదీల్లో రైలు బయలు దేరి.. మరుసటిరోజు రాత్రి 10.30 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. అదేవిధంగా అదే రైలు తిరగి 6, 13, 20 ,27 తేదీల్లో ఉదయం 9.50 గంటలకు రామనాథపురంలో బయలు దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.