రాజకీయాల్లోకి సినీ నటుడు షాయజి షిండే

ముంబయి (CLiC2NEWS): సినీ నటుడు షాయజి షిండే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టి (NCP) లో చేరారు. ఎన్‌సిపి చీఫ్ మహారాష్ట్ర డిప్యూటి సిఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టిలోకి ఆహ్వానించారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో షిండే పోటీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆయన ఇటీవల ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ కలిశారు. దేవాలయాల్లో భక్తులకు ప్రసాదంతోపాటు ఓ మెక్కను కూడా ఇవ్వాలనే తన ఆలోచన గురించి పవన్‌కల్యాణ్ కు తెలిపారు.