చర్లపల్లి: బిఎన్‌రెడ్డి నగర్‌లో అగ్నిప్రమాదం

చర్లపల్లి (CLiC2NEWS): పారిశ్రామిక వాడలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. బిఎన్‌రెడ్డి నగర్‌లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసే కేన్ కేన్ సంస్థలో మంటలు వ్యాపించాయి. మంటలు పైకి ఎగసి పడుతూ , చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలలంఓ మంటలను అదుపులోకీ తెచచారు. రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగనట్లు భావిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.