Hyderabad: హిమయత్ నగర్‌లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ (CLiC2NEWS): హిమయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మినర్వా హోటల్లో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ కిచెన్‌లో మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. హోటల్‌లోని సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు , పక్కన ఉన్న దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.