కూకట్‌పల్లి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని కూకట్ పల్లి లో ఓ ప్లాస్టిక్ గ్లాసుల తయారీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఎంఎన్ పాలిమర్స్ అనే సంస్థ ప్రశాంత్‌నటర్‌లో పేపర్ ప్లేట్లు , ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేస్తోంది. ఈ పరిశ్రమలో ఒక్కసారిగి మంటలు వ్యాపించాయి. పరిశ్రమలో ఉన్న ముడిసరకు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ఉత్పత్తి మొత్తం అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. కార్మికులు అప్రమత్లమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చారు