మహీంద్రా కార్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని మాదాపూర్ మహీంద్రా కారు షోరూమ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ మంటలు ఎగసి పడుతున్నాయి. పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.