సికింద్రాబాద్ ప‌రిధిలోని ఓ షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

సికింద్రాబాద్ (CLiC2NEWS): ప‌రిధిలోని డెక్క‌న్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో మంటలు వ్యాపించి, ద‌ట్ట‌మైన పొగ అలుముకుంది. ఆరు అంత‌స్తులు ఉన్న బిల్డింగ్‌లో కింద కార్ల విడి భాగాల గోదాం, పైన స్పోర్ట్స్ షోరూం నిర్వ‌హిస్తున్నారు. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు వ్యాపించ‌న‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజ‌న్ల సాయంతో మంటల‌ను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా మంట‌లు ఉద్థృతి త‌గ్గ‌క‌పోగా.. ప్ర‌క్క‌న ఉన్న నాలుగు భ‌వ‌నాల‌కు మంట‌లు వ్యాపించాయి. భ‌వ‌నంలో ఇంకా ఎవ‌రైనా చిక్కుకున్నారేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ద‌ట్ట‌మైన పొగ‌లు అలుముకోవ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌లకు విఘాతం క‌లుగుతోందంటున్నారు. సిబ్బంది సైతం పొగ కారణంగా అస్వ‌స్థ‌త‌కు గురవ‌టంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.