నగరంలోని స్క్రాప్ గోదాములో అగ్నిప్రమాదం.. రూ.కోటి మేర నష్టం

హైదరాబాద్ (CLiC2NEWWS): నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మ గూడలో ఉన్న ఓ స్క్రాప్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 2 గంటల పాటు రెండు అగ్ని మాపక యంత్రాల సాయంతో మంటను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ. కోటి విలువైన స్క్రాప్ మంటల్లో కలిపోయినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసి పడటంతో పరిసర ప్రాంతాల్లో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.