విజయవాడ: స్టెల్లా కాలేజ్ సమీపంలోని ఓ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/Fire-accident-in-vijayawada.jpg)
విజయవాడ (CLiC2NEWS): నగరంలోని కెపినగర్ ప్రాంతంలో ఉన్న టివిఎస్ వాహనాల షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వాహనాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. గోదాములో ఉన్న సుమారు 300లకు పైగా ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. భద్రతా సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గోదాములో సాధారణ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు సమాచారం.
విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన హెడ్ ఆఫీస్ కావడంతో ఇక్కడ షోరూంలో వందల సంఖ్యలో వాహనాలు గోదాముల్లో ఉంచుతారు. వీటితో పాటు సర్వీసింగ్ సెంటర్‌లు కూడా పక్కనే ఉన్నాయి. ఒకే చోట షోరూం, గోడౌన్, సర్వీస్ సెంటర్ ఉండటంతో వాహనాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.