బహదూర్‌పురాలో ప్రైవేటు బస్సులో మంటలు..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బహదూర్‌పుర సమీపంలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. మీర్ ఆలం పోలిస్ స్టేషన్ పరిధిలో గ్యారేజ్‌లో నిలిపిఉన్న ప్రైవేటు బస్సులో మంటలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో మంటలు రావడానికి కారణాలు తెలియలేదు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.