Afghanistan: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి

కాబూల్‌ (CLiC2NEWS): అఫ్గానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి జనాలు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సరిహద్దుల వైపు పరుగులు తీస్తుంటే.. మరికొందరు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తున్నారు. అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయారన్న వార్త తెలుసుకోగానే.. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, మంత్రులు, మహిళలు ప్రాణభయంతో చేతికి అందిన సామగ్రి తీసుకొని దేశం విడిచి పెట్టి వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకొన్నారు. దీంతో హమీద్‌ కర్జారు అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌లో భారీగా రద్దీ ఏర్పడింది. విమానాల్లోకి ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జనాల మధ్య తోపులాట చోటుచేసుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అమెరికా భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరిణించారు. వీడి వెళ్లిపోవాల‌ని భావిస్తున్న అక్క‌డి పౌరులు వేలాదిగా కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు త‌ర‌లి వ‌స్తున్నారు. విమానాలు ర‌న్‌వేల‌పై ల్యాండ్ అవుతున్న స‌మ‌యంలో వాటి వైపు దూసుకెళ్తున్నారు. ఆగిన విమానాల్లోకి ఎక్క‌డానికి ఎగ‌బ‌డుతున్నారు. దీంతో వాళ్ల‌ను నియంత్రించ‌డానికి అమెరికా బ‌ల‌గాలు గాల్లోకి కాల్పులు జ‌రిపిన‌ట్లు మొద‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు కాబూల్ ఎయిర్‌స్పేస్‌ను కూడా మూసివేయ‌డంతో అన్ని విమాన రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: కిక్కిరిసిపోయి కాబుల్ విమానాశ్రయం
Leave A Reply

Your email address will not be published.