ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం
మనీలా (CLiC2NEWS): ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 85 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం సి-130 కుప్పకూలింది. జోలో ద్విపం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా విమానంలో ఉన్న 40 మందిని రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన తెలిపారు. మిగతావారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 85 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం నేలకూలింది. ఆ వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి