జలదిగ్భంధంలో ఏడుపాయల దుర్గమాత ఆలయం

మెదక్ (CLiC2NEWS): జిల్లాలోని ఏడుపాయలలో ఉన్న వన దుర్గామాత ఆలయంలోకి వరదనీరు పోటెత్తెంది. దీంతో ఆలయం మూసిఉంచారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆలయం 12 రోజుల పాటు మూత పడింది. సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నుండి నీరు వదలడంతో ఆలయ గర్భగుడిలోకి వరదనీరు చేరింది. ఆలయం ఎదుట మంజీరా ప్రవాహం ఉద్దృతంగా కొనసాగుతుంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రాహానికి పూజలు కొనసాగుతున్నాయి.