హైదరాబాద్-విజయవాడ జాతీయ రాహదారిపై వరద నీరు

కోదాడ (CLiC2NEWS): భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో కోదాడ బైపాస్ లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి నీరు చేరింది. దీంతో కోదాడ వద్ద ట్రాఫిక్‌జామ్ కావడంతో వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. వాహనాలు భారీగా ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ఎపిలో భారీ వర్షాలకు 8 మంది మృతి..సిఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష