విజయవాడలోని వరద బాధితులకు డ్రోన్‌ల ద్వారా ఆహార పంపిణీ

విజయవాడ (CLiC2NEWS): నగరంలో వరద ముంపు ప్రాంతాలకు డ్రోన్ ద్వారా ఆహా పంపిణీ చేస్తున్నారు. నగరంలో నీట మునిగిన రవినగర్, వాబేకాలని, జక్కంపూడి ప్రాంతాల్లో ఎంఐ-17 హెలికాప్టర్ ద్వరా ఆహారం , నీరు అందజేస్తున్నారు. వరద బాధిత ప్రాంతాలలో సహాయక చర్యలు విభాగాల వారీగా అధికారులకు మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు అప్పగించారు. అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలు ఏమేరకు పూర్తి చేశారన్న విషయంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ఆహారాన్ని తెప్పించి .. బాధితులకు చేరవేసే బాధ్యతన సీనియర్ ఐఎఎస్ అధికారి వీరపాండ్యన్‌కు అప్పగించారు. బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల నుండి ఆహార పోట్లాలరె పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.