పారాలింపిక్స్‌ బ్యాడ్మింట‌న్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణం, ర‌జ‌తం, కాంస్యప‌త‌కాలు 

పారిస్‌: పారాలింపిక్స్ బ్యాడ్మింట‌న్ పురుషుల విభాగంలో నితేశ్ కుమార్ ప‌సిడి సాధించాడు. పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 3లో 21-14 , 18-21, 23-21 తేడాతో డానియ‌ల్ బెతెల్ (బ్రిట‌న్‌) ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో బెతెల్ ర‌జ‌తం గెలిచి ఈ సారి కూడా గ‌ట్టి పోటీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఎస్ ఎల్4 లో సుహాస్ ఇతిరాజ్ త‌ల‌ప‌డ‌నున్నారు. టోక్యో లో ర‌జ‌తం గెలిచిన సుహాస్.. రెండో సారి కూడా ఫైన‌ల్ కు చేరాడు. ఈ రోజు రాత్రి 9.40 గంట‌ల‌కు ఫైన‌ల్ ప్రారంభం కానుంది.

మ‌రోవైపు మ‌హిళ బ్యాడ్మింట‌న్ సింగిల్స్ ఎస్‌యు5 ఫైన‌ల్‌లో తుల‌సిమ‌తి మురుగేశ‌న్ ర‌జ‌తం, మ‌నీషా రామ్‌దాస్ కాంస్య ప‌త‌కాలు సాధించారు. తుల‌సిమ‌తి 17-21, 10-21తో యాంగ్ క్విక్సియా (చైనా) చేతిలో ఓట‌మి పాలై గోల్డ్ చేజార్చుకుంది. కాంస్య ప‌త‌క పోరులో మ‌నీషా 21-12, 21-8 తో కేథ‌రీన్ రోసెన్‌గ్రెడ్ (డెన్మార్క్‌) ను ఓడించి ప‌త‌కం సాధించింది. దీంతో ఇవాల్టి వ‌ర‌కు భార‌త్ ప‌త‌కాల సంఖ్య 11కు చేరింది.

Leave A Reply

Your email address will not be published.