ఎపి సిఐడి క‌స్ట‌డీలో మాజీ మంత్రి నారాయ‌ణ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి నారాయ‌ణ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్ కెపిహెచ్‌బిలోని ఆయ‌న నివాసంలో ఎపి చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐకియా ద‌గ్గ‌ర మాజీ మంత్రి నారాయ‌ణ‌, ఆయ‌న స‌తీమ‌ణి ర‌మాదేవిని అరెస్టు చేసిన పోలీసులు వారి సొంత వాహ‌నంలోనే ఎపికి త‌ర‌లించారు. నారాయ‌ణ అరెస్టును చిత్తూరు పోలీసులు ధ్రువీక‌రించారు. ప‌దోత‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో ఇటీవ‌ల చిత్తూరు వ‌న్‌టౌన్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. నారాయ‌ణ విద్యా సంస్థ‌ల నుంచి లీకేజీ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌తో కొద్ది రోజుల కింద‌ట వైస్ ప్రిన్సిప‌ల్ గిరిధ‌ర్‌తో పాటు మ‌రికొంత మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నేప‌థ్యంలోనే అక్క‌డి పోలీసులు హైద‌రాబాద్ వ‌చ్చి నారాయ‌ణ‌ను కూడా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్లో టెన్త్ ప‌రీక్ష ప‌త్రాలు లీక్ అయ్యాయి. ఈ వ్య‌వ‌హారం వెనుక నారాయ‌ణ‌, శ్రీ‌చైత‌న్య విద్ఆయ‌సంస్థ‌లు ఉన్న‌ట్లు కొద్ది రోజుల కింద‌ట తిరుప‌తి స‌భ‌లో ఎపి సిఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ నేప‌త్యంలో ఎపి పోలీసులు మాజీ మంత్రి నారాయ‌ణ‌ను అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Leave A Reply

Your email address will not be published.