వైఎస్ఆర్‌సిపి నుండి మాజీ మంత్రి సుబ్బారాయుడు స‌స్పెన్ష‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడును వైఎస్ఆర్‌సిపి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడును స‌స్పెండ్ చేసిన‌ట్టు పార్టీ కేంద్ర కార్యాల‌యం బుధ‌వారం ప్రక‌టించింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేకంగా జ‌రిగిన న‌ర‌సాపురం జిల్లా సాధ‌న స‌మితి ఉద్య‌మంలో సుబ్బారాయుడు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్ర‌సాద్‌రాజుపై బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేయ‌డం, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా పోటీ చేస్తాన‌ని విలేక‌రుల స‌మావేశంలో బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌టంతో అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.