ఎపి క్రికెట్ అసోసియేష‌న్ కొత్త కోచ్ న్యూజిలాండ్ మాజి క్రికెట‌ర్ గ్యారి స్టీడ్‌

విశాఖ‌ (CLiC2NEWS): ఆంధ్ర ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ కు నూత‌న కోచ్‌గా న్యూజిలాండ్ మాజి క్రికెట‌ర్ గ్యారి స్టీడ్‌ను నియ‌మితుల‌య్యారు. ఎసిఎ రంజీ క్రికెట్ సీజ‌న్ 2025-26 పురుషుల జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ అసోసియేష‌న్ కు విదేశీ క్రికెట‌ర్‌ను కోచ్‌గా నియ‌మించ‌డం ఇదే ప్ర‌ధ‌మం. గ్యారీ స్టీడ్.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్‌గా త‌న ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఎసిఎ ప్ర‌ధాన కోచ్‌గా నియ‌మించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర ప్లేయ‌ర్స్‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో స్థానం ద‌క్కాల‌నే ఉద్దేశంతో ఈ నియామ‌కం చేప‌ట్టిన‌ట్లు ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Job News: మెకాన్ లిమిటెడ్‌లో 47 ఇంజినీరింగ్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.