స‌ముద్ర గ‌ర్భంలోని ద్వార‌క న‌గ‌రాన్ని చూసే భాగ్యం..!

ద్వార‌క (CLiC2NEWS): వేల సంవ‌త్స‌రాల క్రితం ఆరేబియా స‌ముద్రంలో మునిగిపోయిన ద్వార‌క న‌గ‌రాన్ని ఇపుడు మనం సంద‌ర్శించే అవ‌కాశం క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. గుజ‌రాత్‌లో ఉన్న ద్వార‌క న‌గ‌రాన్ని సంద‌ర్శించేందుకు వేల సంఖ్య‌లో భ‌క్త‌జ‌నం వ‌స్తుంటారు. శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు నిర్మించిన ద్వార‌క పురాత‌న న‌గ‌రాన్ని ద‌ర్శించేందుకు వీలుగా జ‌లాంత‌ర్గామి సేవ‌లను గుజ‌రాత్ ప్ర‌భుత్వం అందుబాటులోకి తెస్తున్నారు. ముంబ‌యికి చెందిన ప్ర‌భుత్వ రంగ నౌక సంస్థ మ‌జాగాన్‌తో ఇటీవ‌ల కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం.. జ‌లాంత‌ర్గామి సేవ‌లు అందుబాటులోకి రానున్నట్లు స‌మాచారం. దీనిలో 24 మంది యాత్రికులు ప్ర‌యాణించ‌వ‌చ్చు. అరేబియా స‌ముద్రంలో 300 అడుగుల దిగువ‌కు ఈ జ‌లాంత‌ర్గామి తీసుకెళ్తుంది. ఈ జ‌లాంత‌ర్గామిలో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు, టెక్నీషియ‌న్‌, గైడ్ కూడా ఉంటార‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.