భారీ ఈదురు గాలుల‌కు రేకుల షెడ్డు కూలి న‌లుగురు మృతి

తాడూరు (CLiC2NEW)S: నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లా తాడూరులో విషాదం చోటుచేసుకుంది. తాడూరు శివారులో ఆదివారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలుల‌కు నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ప‌దేళ్ల చిన్నారితో పాటు న‌లుగురు మృతి చెందారు. వీరిలో య‌జ‌మాని, చిన్నారి , ఇద్ద‌రు కూలీలు ఉన్నారు.

రాష్ట్రంలో గ‌త కొన్ని రోజులుగా ప‌లు ప్రాంతాల‌లో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు చోట్లు ఈదురు గాలులకు చెట్లు కూలిపోయి వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు క‌లుగుతుంది. ఆదివారం ఈదురుగాలుల‌కు నిర్మాణంలో ఉన్న ఓ రేకుల షెడ్డు కూలి న‌లుగురు మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.