బంగారం చోరీకి పాల్ప‌డుతున్న న‌లుగురు మహిళ‌లు అరెస్ట్

మంచిర్యాల (CLiC2NEWS): బెల్లంప‌ల్లి టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ న‌గ‌ల దుకాణంలో బంగారం చోరీకి గురైంది. న‌లుగురు మ‌హిళ‌లు షాప్‌లోకి వ‌చ్చి క‌మ్మ‌లు చూపించ‌మ‌ని అడిగి 9 జ‌త‌ల కమ్మ‌లు, సుమారు. 57 గ్రాముల బంగారం చోరీ చేశారు. వాటి విలువ స‌మారు రూ.2,80,000 ఉంటుంద‌ని తెలిపారు. బంగారం క‌మ్మ‌ల స్థానంలో న‌కిలీవి ఉంచారు. షాప్‌లోని సిసికెమెరా ఆధారంగా చోరీకి పాల్ప‌డిన బాలసాని వెంకటరమణ, మేచర్ల రేణుక, బోజ్జగని దీనమ్మ, బోజ్జగని నాగెంద్రమ్మ న‌లుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. మహిళా దొంగలను  పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మాదారం ఎస్సై హైమ, సిబ్బంది సంపత్ కుమార్,మల్లేష్, మహిళా హోం గార్డ్ సౌజన్య లను మంచిర్యాల ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్, మంచిర్యాల, ఏ సి పి బెల్లంపల్లి మహేష్ లు అభినందించి క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది.

slot gacor

Leave A Reply

Your email address will not be published.