నంద్యాల జిల్లాలో దారుణం.. కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

బేతంచర్ల (CLiC2NEWS): నాలుగేళ్ల చిన్నారి వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని హనుమాన్ నగర్లో కాలనీలో చోటుచేసుకుంది. కాలనీలో నివసిస్తున్న హుస్సేన్ బాషా, ఆశ దంపతుల చిన్న కుమారుడు మొహిద్దీన్ పై వీధికుక్కలు దాడి చేశాయి. ఆ చిన్నారి మరో ఇద్దరితో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. వీధికుక్కల గుంపు చిన్నారులను పరిగెత్తించాయి. మొహిద్దీన్ వెంట ఉన్న ఇద్దరు చిన్నారులు పరుగెత్తినా.. మొహిద్దీన్ మాత్తం శునకాల దాడికి గురయ్యాడు. కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.