ముఖ్యమంత్రి కార్యాలయం అధికారినంటూ మోసాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) అధికారినని చెప్పుకుంటూ.. ఉద్యోగాలు ఇప్పిస్తానని, భూసమస్యలు పరిష్కరిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ప్రవీణ్ సాయిని పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన అత్తిలి ప్రవీణ్ సాయి.. పలువురికి సిఎం ప్రొటోకాల్ నకిలీ స్టిక్కర్లు అందించినట్లు అభియోగాలున్నట్లు సమాచారం. మంత్రుల లెటర్ హెడ్స్‌తో కొలువులు ఇప్పిస్తానని, భూసమస్యలు సైతం పరిష్కరిస్తానంటూ ప్రవీణ్ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి దగ్గర నుండి ఇన్నోవా కారు, సెల్‌ఫోన్ సీజ్ చేశారు. నిందితుడిని ఎల్బినగర్ ఎస్ ఒటి పోలీసులు అదుపులో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.