పేద విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ శిక్షణ తరగతులు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/07/students.jpg)
జనగామ (CLiC2NEWS): మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉచితంగా ప్రభుత్వం టిశాట్ ద్వారా కోచింగ్ ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థులకు ఈ సదుపాయం కల్పించింది. ఎంసెట్ రాయలనుకునే విద్యార్థులు కోచింగ్ కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నందున.. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల రచయితలు, నిపుణులతో టిశాట్ ద్వారా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శిక్షణనిస్తున్నారు. ఎంసెట్ నిర్వహించే సమయానికి సిలబస్ మొత్తం పూర్తయ్యే విధంగా టైంటేబుల్ కూడా రూపొందించారు. దీని ద్వారా శిక్షణ తీసుకునే విద్యార్థినికి ప్రత్యేక కోడ్ నంబరు కేటాయిస్తారు.