ఐదేళ్లలోపు చిన్నారుల‌కు ఉచిత వైద్యం.. త‌ల్లుల‌కు పారితోష‌కం

క‌ర్నూలు (CLiC2NEWS): బ‌రువు, ఎత్తు త‌క్కువుగా ఉన్న ఐదేళ్లలోపు చిన్నారుల‌కు ఎన్ ఆర్‌సి కేంద్రాల్లో ప్ర‌త్యేక చికిత్స‌తో పాటు ఉచితంగా పోష‌కాహారంను అందిస్తోంది. రోజుకు 15 మంది చిన్నారులకు న్యూట్రిన్ రిహాబిలిటేష‌న్ సెంట‌ర్‌లో వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నారు. చిన్నారుల‌తో పాటు త‌ల్లిదండ్రుల‌కూ పారితోష‌కం ఇచ్చి ప్రోత్స‌హిస్తున్నారు. క‌ర్నూలు ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న వైద్య‌శాల‌లోని చిన్న‌పిల్ల‌ల విభాగంలో ఎన్ ఆర్‌సి లో చిన్నారుల‌కు 14 నుండి 21 రోజుల పాటు వార్డులో ఉంచి , బ‌రువులో మార్పు వ‌చ్చాక డిశ్చార్జ్ చేయ‌టంతో పాటు ఇంటి వ‌ద్ద ఏమి తినాలి,ఎలా తినిపించాలో త‌ల్లి దండ్రుల‌కు వివ‌రించి పంపుతున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారుల త‌ల్లుల‌కు ఉచితంగా భోజ‌నంతో పాటు రోజుకు రూ. 150 చొప్పున పారితోష‌కం అందిస్తున్నారు. వైద్యం కోసం ప‌నులు మానుకొని ఆస్ప‌త్రిలో ఉంటున్నందుకు ఆస‌రాగా ఈ మొత్తాన్ని ప్ర‌భుత్వం అందిస్తోంద‌ది.

Leave A Reply

Your email address will not be published.