ఉచిత యోగా శిక్షణ

ఖమ్మం (CLiC2NEWS): మధుమేహవ్యాధి వున్నవారికి, వ్యాధిని తగ్గించటానికి ఉచితంగా మూడు రోజుల పాటు యోగ శిక్షణ ఇవ్వబడును అని ఆయుర్వేద వైద్యుడు, యోగాచార్యుడు. షేక్. బహార్ అలీ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఖమ్మం పట్టణంలో రేపటి నుండి మూడు రోజుల (18 నుండి 20వ తేదీ వరకు) పాటు ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి 6 వరకు ఈ ప్రత్యేక శిక్షణా కార్య్రమాలను నిర్వహించ నున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగ శిక్షణ తో పాటు ఆహారనియమాలు చెప్పబడును. అలాగే పేదవారికి ఉచితంగా ఆయుర్వేద మందులు ఇవ్వబడును అని పేర్కోన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనేవారు 7396126557 ఈ నెంబర్ కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోగలరని షేక్. బహార్ అలీ. ప్రకటనలో పేర్కొన్నారు.