ఆన్‌లైన్‌లో ఉచిత యోగా శిక్షణ

ఖమ్మం (CLiC2NEWS): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాచార్యులు షేక్ బహర్ అలీ… ఉచిత యోగా శిక్షణ క్లాసులను పీస్ యోగ wellness ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు ఆన్‌లైన్ ద్వారా ఉచిత యోగా సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “స్వస్త్ శిక్షణ-స్వయం రక్షణ“ అనే పేరుతో నిర్వహించే ఈ యోగా శిక్షణను శుక్రవారం (రేపు) ఉదయం గం. 05:15 నుండి 06: 00 వరకు నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగ శిక్షణ తో పాటు ఆహారనియమాలు చెప్పబడును. ఈ కార్యక్రమం లో పాల్గొనేవారు 7396126557 ఈ నెంబర్ కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోగలరని యోగా గురువు షేక్. బహార్ అలీ ప్రకటనలో పేర్కొన్నారు.