Hyderabad: శ‌నివారం ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో శ‌నివారం తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. న‌గ‌రంలోని హైద‌ర్‌న‌గ‌ర్ నుండి అల్వాల్ వ‌ర‌కు ఉన్న ప్ర‌ధాన పైపులైన్‌కు షాపూర్‌న‌గ‌ర్ వ‌ద్ద మ‌ర‌మ్మ‌తులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ప‌లు ప్రాంతాల వారికి నీటి స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌బ‌డుతుంది.

మంచినీటి స‌ర‌ఫ‌రా అంత‌రాయం క‌లిగే ప్రాంతాలు

షాపూర్ న‌గ‌ర్‌, సంజ‌య్ గాంధీ న‌గ‌ర్‌, క‌ళావ‌తి న‌గ‌ర్, హెచ్ ఎంటి సొసైటి, హెచ్ ఎఎల్ కాల‌ని, టిఎస్ ఐఐసి కాల‌ని, రొడా మేస్త్రీ న‌గ‌ర్‌, శ్రీ‌నివాస్ న‌గ‌ర్‌, ఇందిరా న‌గ‌ర్‌, గాజుల‌రామారం, శ్రీ సాయి హిల్స్‌, దేవేంద‌ర్ న‌గ‌ర్‌, కైలాస్ హిల్స్ , బాలాజి లే అవుట్ , కైస‌ర్ న‌గ‌ర్ ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫరాకు అంత‌రాయం క‌లుగుతుంది. కావున ఆయా ప్రాంతాల్లో నివ‌సించే వారు నీటిని పొదుపుగా వినియోగించుకోగ‌ల‌ర‌ని జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.