నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS): మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై పథకం ఫేజు – 2 లో భాగంగా పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నవంబరు 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు ప్రకటనలో తెలిపారు.
పాక్షికంగా అంతరాయం కలుగు ప్రాంతాలు :
ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ ప్రాంతాలలో తక్కువ ప్రెజర్‌తో నీటి సరఫరా ఉంటుంది.
పూర్తిగా అంతరాయం కలుగు ప్రాంతాలు:
కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్.
ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్.
బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం.
కాబట్టి పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని కోరడమైనది.