నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/illegal-water-connection.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు ప్రకటనలో తెలిపారు. సింగూరు నుంచి నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్ కు ఖానాపూర్ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. 7వ తేదీ ఉదయం 6 గంటల నుండి 8వ తేదీ ఉదయం 6 గంటలు.. మొత్తం 24 గంటలు వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. కాబట్టి ఈ 24 గంటలు కింద పేర్కొన్న సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న రిజర్వాయర్ పరిధి ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు :
షేక్‌పేట్, టోలిచౌకి, గోల్కొండ, బోజగుట్ట రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. గండిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచి రేవుల ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగనుందని.. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.