ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ చెర్మన్ పద్మ సందేశ్ గుప్తాకు ఘనంగా సన్మానం
మంచిర్యాల (CLiC2NEWS): పట్టణంలోని లోని వెలుగు ఫౌండేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన మంచిర్యాల జిల్లా స్వచ్ఛంద సంస్థల సర్వసభ్య సమావేశంలో ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ చైర్మన్ పద్మ సందేశ్ గుప్తాను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లోని అన్ని మండలాలనుండి 50 స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
జంతువుల సంరక్షణ, వాటికి ఆహారం అందించడం, వాటి సంక్షేమం కొరకు ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సందేశ్ గుప్తా నిరంతరం కృషిచేస్తున్నాడు. తనలాగే ప్రతి ఒక్కరూ పని చేయాలనే సందేశాన్ని దేశ వ్యాప్తంగా తెలియజేయడానికి మంచిర్యాల నుండి కాశీ వరకు 2700 సైకిల్ యాత్ర చేసి విజయవంతంగా ముగించుకుని వచ్చినందుకు వారిని ఘనంగా సన్మానం చేసి అభినందించడం జరిగింది.
అనంతరం జరిగిన సర్వసభ్య సమావేశంలో మంచిర్యాల జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు అన్ని ఒక కమిటీగా ఏర్పడి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ గుర్తింపు సాధించాలని, ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారికంగా పాలుపంచుకునే విధంగా, అందరికీ గుర్తింపు వచ్చే విధంగా అందరం కలిసి కృషి చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలకు చెందిన పలువురు పాల్గొన్నారు.
Congratulations Sandesh Gupta garu