ఇక నుండి ప్రతిభ అధారంగా గ్రీన్ కార్డ్..

వాషింగ్టన్ (CLiC2NEWS): ఇప్పటివరకు పుట్టిన దేశం ప్రాతిపదికపైన గ్రీన్ కార్డు పొందే విధానాన్ని రద్దుచేసి.. ప్రతిభ ఆధారంగా సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ విధంగా సిబ్బందిని నియమించుకొనే అవకాశమిచ్చే ఈగిల్ చట్టానికి అమెరికా అధ్యక్ష భవనం మద్దతు ప్రకటించింది. గ్రీన్ కార్డు అంటే యుఎస్‌లో శాశ్వతంగా నివాసం ఉండటానికి అనుమతించే అధికారం పత్రం. ప్రతీ దేశానికి నిర్ణీత సంఖ్య (కోటా)లో గ్రీన్ కార్డులను జారీచేసే విధానం అమలులో ఉంది. చిన్న చిన్న దేశాల నుండి ఈ అమెరికాకు వెళ్లే వారు తక్కువ సంఖ్యలో ఉండటం వలన ఆ దేశాల గ్రీన్ కార్డు కోటాలు మురిగిపోతున్నాయి.
భారత్ నుండి అధిక సంఖ్యలో యుఎస్ వెళుతున్నా.. కోటా విధానం కారణంగా గ్రీన్ కార్డులు లభించడం లేదు. అందుకే కంపెనీ అవసరాల మేరకు వలస సిబ్బందిని నియమించుకోవడానికి వీలుగా దేశాల వారీగా కోటాను తొమ్మిదేళ్ల వ్యవధిలో ఎత్తివేయాలని ఈగిల్ బిల్లు ప్రతిపాదిస్తుంది. చట్టబద్ధమైన ఉపాధికి సమాన అవకాశాల కల్పన బిల్లును ఈగిల్ చట్టంగా, హెచ్ ఆర్ 3648గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అమెరికా పార్టమెంట్‌లోని ప్రజాప్రతినిధుల సభలో ఈ వారంలో ఓటింగ్ జరుగనుంది.
ఈగిల్ బిల్లు.. నిర్ణీత సమయంలో ఏ దేశానికీ గ్రీన్ కార్డులను నిరాకరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్డేశిస్తోంది.
ఇక ఈ తొమ్మిదేళ్ల కాలంలో అమెరికాకు వచ్చే నర్సులు, డాక్టర్స్‌కి కొన్ని వీసాలను ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఉపాధి కోసం వచ్చే నిపుణులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వీసాలు ఇవ్వనున్నారు.
Great line up. We will be linking to this great article on our site. Keep up the good writing.