బోనాలకు ముందే దేవాలయాలకు నిధులు: మంత్రి తలసాని
హైదరాబాద్ (CLiC2NEWS): బోనాలు పండుగకు ముందే దేవాలయానికి సర్కార్ ఆర్థిక సహాయం అందిస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో మ్రతులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలెక్టర్లతో టెలి కాన్షరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలు పండుగకు అంత్యం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బోనాలు ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 15 కోట్లు సర్కార్ మంజూరు చేసిందన్నారు. 3,500లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయం అందజేశామని మంత్రి తెలిపారు. 17వ తేదీన బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజుల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. 24న హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18న చెక్కుల పంపిణీకి ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.