భూపాలపల్లి కోర్టులో ఘనంగా గాంధీ జయంతి

భూపాలపల్లి (CLiC2NEWS): జిల్లాలోని కోర్టులో ఇవాళ (శనివారం) జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా న్యాయవాదులు వలబోజు శ్రీనివాసాచారి, సంగం రవీందర్, ఆరెల్లి వెంకటస్వామి, పారనంది సురేందర్, కనపర్తి కవిత తదితర న్యాయవాదులు పాల్గొన్నారు