దేవీపట్నంలో నీటమునిగిన గండిపోచమ్మ గుడి
దేవీపట్నం (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పోటెత్తిన వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదకు అక్కడి గండి పోచమ్మ ఆలయం నీట మునిగింది. అమ్మవారి విగ్రహం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో పాటు గుడి పరిసరాల్లోని జనావాసాలు కూడా నీట మునిగాయి. సహాయక చర్యల్లో భాగంగా అక్కడ ప్రజలను అధికారులు సుక్షిత ప్రాంతాలకు తరలించారు