వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: రామగుండం సిపి

రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని గణేశ్ మండపాలను ఆదివారం రాత్రి సందర్శించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సిసి కెమెరాల ఏర్పాట్లును పరిశీలించారు.
సమస్యలు ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు, ఆంక్షలు పాటించాలని, ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. అధికారులకు బందోబస్తు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, మండపం వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ బుక్ లను చెక్ చేయాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఉన్నారు.