గణేశ నిమజ్జనం.. హైదరాబాద్‌లో 17న అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

హైదరాబాద్ (CLiC2NEWS): గణేశ నిమజ్జనం… శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17వ తేదీన అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ వెల్లడించింది. చివరి మెట్రో స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు చివరిరైలు బయలుదేరుతుందని పేర్కొంది. నిమజ్జనం రోజు అవసరం మేరకు భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లను నడుపుతామని వెల్లడించింది. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి నగరంలోని మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు 94 వేల మంది ప్రయాణికులు సేవలు వినియోగించుకున్నారు.